Hyderabad School Drug Lab: మేధా స్కూల్ మాటున డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు వెలగులోకి వస్తున్నాయి !! నిందితుడు జయప్రకాష్ గౌడ్… డ్రగ్స్ తరలించిన తీరు వెలుగులోకి రావడంతో పోలీసులు అవాక్కవుతున్నారు. జయప్రకాష్‌ను పోలీసులు ఎన్నోసార్లు పట్టుకున్నారు. బైక్ పేపర్లు చెక్ చేశారు. చలాన్లు వేశారు. కానీ బైక్‌పై ఏం తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం చెక్ చేయలేదు. ఎవరికీ అనుమానం రాకుండా.. వందల కిలోమీటర్ల దూరం కూడా బైక్‌పైనే వెళ్లి డ్రగ్స్ సరఫరా చేశాడు. ఇప్పటికే మేధా స్కూల్‌ను సీజ్ చేసిన పోలీసులు… జయప్రకాష్ కూపీ లాగుతున్నారు.
READ ALSO: Murder Attempt: శాడిస్ట్ మొగుడు.. అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం!
స్టార్ట్ విత్ ఈడియట్ మూవీ క్లిప్..
ఇడియట్ సినిమాలో ఈ సన్నివేశం.. సినిమా లవర్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బైక్‌పై అలీ బీదర్‌కు వెళ్తూ వస్తుంటాడు. బైక్‌పై తరలిస్తున్న ఇసుకను పోలీసులు ప్రతీసారి చెక్ చేస్తారు కానీ.. అలీ చేస్తున్న మోసం గమనించరు. చివరకు అర్థమవుతుంది… అలీ రోజుకో బైక్ దొంగిలించి వాటిని పక్క రాష్ట్రం తీసుకెళ్లి అమ్ముతుంటాడు… ఇదే తరహాలో డ్రగ్స్ రవాణా చేశాడు జయప్రకాష్ గౌడ్. బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌ను అడ్డాగా చేసుకుని.. ఆల్ర్ఫాజోలం తయారు చేయడమే కాకుండా.. తయారు చేసిన డ్రగ్‌ను తానే స్వయంగా బైక్‌పై రవాణా చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పైనే దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా బైక్‌లోనే డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేశాడు. మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు చేసిన పోలీసులు కూపీ లాగగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి…
సంచిలో ఏముందని అడగలేదు..
జయప్రకాష్ తన బైక్ మీదే అన్ని చోట్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో చెప్పడంతో.. బైక్ డీటెయిల్స్‌ను చెక్ చేశారు. జయప్రకాష్ తన బైక్‌పై సంచిలో డ్రగ్స్ తీసుకుని వెళ్తుండగా పోలీసులు కూడా ఎన్నోసార్లు పట్టుకున్నారు. పోలీసులు బైక్ పత్రాలు చెక్ చేశారు కానీ.. బైక్‌పై ఏం తీసుకుని వెళ్తున్నాడు… సంచిలో ఏముంది అని ఒక్కసారి కూడా అడగలేదు. హెల్మెట్ లేదని.. ర్యాష్ డ్రైవింగ్ అని.. ఓవర్ స్పీడ్ అని.. రాంగ్ రూట్ అని… రకరకాలుగా చలాన్లు వేశారు తప్ప.. జయప్రకాష్ తన బైక్‌లో ఏం ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాడు అనేది మాత్రం ఫోకస్ చేయలేకపోయారు పోలీసులు… తీగ లాగితే డొంక కదులుతోంది. జయప్రకాష్ గౌడ్ కేసులో కూపీ లాగుతున్నారు. ఇప్పటికే మేధా స్కూల్‌ను సీజ్ చేశారు పోలీసులు. ఐతే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లల భవిష్యత్తుల అగమ్యగోచరంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు…
READ ALSO: Honeytrap: హనీ ట్రాప్‌లో పడ్డ యోగా గురువు.. కోట్లలో డబ్బు డిమాండ్ చేసిన ముఠా
