బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో గల నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. నూడుల్స్ పరిశ్రమలో వినియోగిస్తున్న ఓ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో అక్కడే ఉన్న 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అయితే ఘటనపై సమాచారం అందిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
