Site icon NTV Telugu

Extramarital Affair: వివాహేతర సంబంధం.. మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి శిక్ష..

Up

Up

Extramarital Affair: అక్రమ సంబంధం పెట్టుకునే ఆరోపణలో ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించారు గ్రామంలోని పంచాయతీ పెద్దలు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని హతిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ వివాహిత మహిళను పంచాయతీ ఆదేశాల మేరకు చెట్టుకు కట్టేసి, జట్టును కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి ఘోరంగా అవమానాలపాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు ఈ కేసులో 15 మందిని అరరెస్ట్ చేయగా, మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

Read Also: Mahrang Baloch: బలూచిస్తాన్‌ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..

మహిళ భర్త ముంబైలో ఉంటున్నాడు. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకుని సొంతూరు వచ్చాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం పంచాయతీ ఆదేశాల మేరకు మహిళను శిక్షించారు. నలుగురు పిల్లల తండ్రైన సదరు మహిళ ప్రేమికుడు ఈ శిక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అతడిని కొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ నంద్ లాల్ సింగ్ ఫిర్యాదు మేరకు 20 మందిపై కేసు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.

Exit mobile version