పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. ఒక వివాహిత అనుమానాదాస్పద రీతిలో మృతిచెందడంస్తానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత.. విజయవాడకు చెందిన సాయి బాలచందు అనే యువకుడిని ఫేస్ బుక్ ద్వారా కలిసింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది వారిద్దరూ పెళ్లి చేసుకొని స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో కాపురం పెట్టారు. సాయిబాలచందు అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తుండగా.. పుష్ప గృహిణిగా ఉంటోంది. ఇక శుక్రవారం భర్త పనికి వెళ్లగా.. సాయంత్రం అతడితో వాట్సాప్ లో చాట్ చేసింది.
భార్యాభర్తలిద్దరూ చాట్ చేసుకుంటున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు.. ఫోన్ పక్కన పడేసి ఆమె గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదే సమయంలో భర్త పక్క గదిలోనే ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్లు ఏమి కనిపించకపోవడంతో వివాహిత మృతిని అనుమానాస్పదంగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.