Married Woman Killed Her Husband Wife Boyfriend: వివాహేతర సంబంధం మోజులో పడి.. కొందరు మహిళలు తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నేరాలకూ పాల్పడుతున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్తలను అన్యాయంగా చంపేస్తున్నారు. తాజాగా ఓ వివాహిత కూడా అలాంటి ఘాతుకానికే పాల్పడింది. మరో యువకుడితో తన కామవాంఛ తీర్చుకోవడం కోసం భర్తనే కడతేర్చింది. ఈ ఘటన చెన్నైలోని ఆర్కేపేట ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యువరాజ్ (29)కి ఐదేళ్ల క్రితం తన మేనమామ కుతూరు గాయత్రి (22)తో వివాహం అయ్యింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. యువరాజ్ ఒక ప్రైవేట్ కంపెనీలు పని చేస్తుండగా.. గాయత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసేది.
5000 Years Fridge: 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. దిమ్మతిరిగే ట్విస్ట్
నర్సుగా పని చేస్తున్న సమయంలో.. గాయత్రికి ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన యువరాజ్.. ఆమెను ఉద్యోగానికి పంపించడం ఆపేశాడు. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే.. ప్రియుడ్ని మాత్రం మర్చిపోలేదు. భర్త లేనప్పుడు అతడ్ని ఇంటికి పిలిపించడం మొదలుపెట్టింది. కట్ చేస్తే.. ఆదివారం రాత్రి యువరాజ్, గాయత్రి తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఏదో విషయంలో గొడవ జరగడంతో.. ఇలా సెపరేట్‌గా నిద్రపోయారు. ఇదే అదునుగా.. రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి తన ప్రియుడ్ని ఇంటికి పిలిపించింది. తనకు శబ్దం రావడంతో.. యువరాజ్ లేచి, గాయత్రి గదిలోకి వెళ్లి చూశాడు. ఇద్దరిని ఒకే రూమ్‌లో చూసి కోపాద్రిక్తుడైన యువరాజ్.. భార్యని నిలదీశాడు. ఆ యువకుడ్ని కొట్టబోయాడు.
Interesting Facts: మిమ్మల్ని వావ్ అనిపించే 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
అప్పుడు గాయత్రి తన ప్రియుడితో కలిసి.. భర్తపై రివర్స్ ఎటాక్ చేసింది. ఇద్దరు కలిసి.. యువరాజ్ గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కోడలు కనిపించకపోవడం, తమ కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి.. యువరాజ్ తల్లితండ్రులు గాయత్రిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎలాగోలా గాయత్రిని పట్టుకోగలిగారు. కానీ, ఆమె ప్రియుడు మాత్రం పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.
