NTV Telugu Site icon

Delhi: పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ చేసిందని, సోషల్ మీడియాలో మహిళ ఫోటోలు

Delhi

Delhi

Delhi: తనను పెళ్లి చేసుకునేందుకు నో చెప్పిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆమె ఫోటోలతో నకిలీ సోషల్ మీడియా ఖతాలను క్రియేట్ చేసి, అవమానకరమైన పోస్టులు పెడుతూ, కించపరిచేలా కామెంట్స్ చేస్తూ వేధించాడు. చివరకు ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల మహిళ చిత్రాలను పోస్ట్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి శనివారం తెలిపారు. ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా సైబర్ నార్త్ పోలీస్ స్టేషన్‌కి అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 2018లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతడితో చాట్ చేయడం ప్రారంభించానని, అయితే కాలక్రమేణా, సదరు వ్యక్తి తనను వేధించడంతో పాటు మతాంతర వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Bihar: బీహార్‌లో దారుణం.. కళ్లలో కారం చల్లి, కత్తులతో పొడిచి దారుణహత్య..

బాధితురాలు అతనితో మాట్లాడటం మానేసినప్పటికీ.. నిందితుడు ఆమె ఫోటోలను ఉపయోగించి రెండు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలతో కొన్ని అభ్యంతరకమైన విషయాలను పోస్ట్ చేశాడు. మహిళకు మొబైల్ నెంబర్‌ని కూడా షేర్ చేశారు. ఇలా చేయడంతో సదరు మహిళ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని డీసీసీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. నిందితుడు గోపాల్ కరాలియను సోమవారం పూణేలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కరాలియాకు 2018లో బాధిత మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమెతో స్నేహం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకోవాలని అడిగాడని, అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో అది కుదరలేదని పోలీసులు తెలిపారు. నిందితుడి పెళ్లి ప్రపోజల్‌ని తిరస్కరించడంతోనే, ఆమె పరువు తీసేందుకు నిందితుడు అవమానకరమైన పోస్టులు పెట్టడం ప్రారంభించినట్లు డీసీపీ వెల్లడించారు.

Show comments