NTV Telugu Site icon

Missed Calls Fraud: మిస్డ్‌ కాల్‌ వచ్చింది.. కట్టలు పోయాయి..

Missed Calls Fraud

Missed Calls Fraud

సైబర్‌ నేరగాళ్లు బరితెగిస్తున్నారు.. ఎప్పుడు, ఎలా, ఎటువైపు నుంచి ఎటాక్‌ చేస్తారో తెలియదు.. ఉన్నకాడికి ఊడ్చేసేవరకు సమాచారమే ఉండదు.. ఏ లింక్‌ క్లిక్‌ చేయాలన్నా వణికిపోవాల్సి వస్తుంది.. ఏ మెసేజ్‌ను నమ్మితే.. దాని వెనుక ఏ మోసం దాగిఉందో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు మరో షాకింగ్‌ మోసం వెలుగు చూసింది.. కేవలం మిస్డ్‌ కాల్‌లో లక్షలు నొక్కేసిన ఘటన.. అందరినీ కలవరపెడుతోంది.. ఇప్పటి వరకు.. సదరు వినియోగదారుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు తెలుసుకునే మోసాలకు పాల్పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఇక, మొబైల్‌కు వచ్చి ఓటీపీ అడిగి బ్యాంకు ఖాతాల నుంచి లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఓటీపీ అవసరం లేకుండా.. కేవలం మిస్డ్‌ కాల్‌తో లూఠీ చేయడం ఆందోళనకు గురిచేస్తోంది..

Read Also: Udhayanidhi Stalin: వారసుడొచ్చాడు.. ‘స్టాలిన్‌ కేబినెట్‌లోకి ఉదయనిధి స్టాలిన్..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూ రిటీ సర్వీ సెస్ సంస్థ ఎండీకి ఓ కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. రాత్రి 7 గంటల నుండి 8:45 గంటల మధ్య కాల్స్ వచ్చాయి. ఒక్కసారి కాదు.. పదే పదే ఆ నంబర్‌ నుంచే కాల్‌ చేశారు కేటుగాళ్లు.. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్య క్తి మాట్లాడలేదు. అయితే, కాసేపటికే ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12 లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు మరోసారి.. రూ.4.6 లక్షలు ఇంకోసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సా క్షన్ ద్వారా రూ.50 లక్షలు నొక్కేశారు కేటుగాళ్లు.. ఊహించని పరిణామంతో షాక్‌తిన్న సదరు వ్యక్తి లభోదిబోమంటూ.. సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.. అయితే, ఇది ‘సిమ్ స్వాపింగ్’ టెక్నిక్‌ని ఉపయోగించి సైబర్ చీటర్స్‌ మోసం చేశారని చెబుతున్నారు పోలీసులు..

Show comments