Site icon NTV Telugu

Live-in partner: సెక్స్‌కి నిరాకరించిందని “లివ్ ఇన్ పార్ట్‌నర్” దారుణహత్య..

Indore

Indore

Live-in partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. యువతీయువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో యువతి దారుణ హత్యకు గురైంది. తనలో శారీరక సంబంధం పెట్టుకోవడానికి, సెక్స్ చేయడానికి నిరాకరించినందుకు 20 ఏళ్ల మహిళలను ఆమె భాగస్వామి అయిన వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగింది. మరణించిన యువతిని నిఖితా ప్రజాపతిగా గుర్తించారు. యువతికి, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్నేహితులయ్యారు, ఆ తర్వాత నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 7న రావుజీ బజార్ ప్రాంతంలో మహిళ హత్య జరిగితే.. రెండు రోజుల తర్వాత డిసెంబర్ 9న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ అభినయ్ విశ్వకర్మ తెలిపారు.

Read Also: CM Revanth: భూ సంబంధిత వివాదాలకు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

గుణ జిల్లాకు చెందిన నిందితుడు ప్రవీణ్ సింగ్ ధాకడ్(24), తనతో సెక్స్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో కోపంతో బాధితురాలి మెడపై కత్తెరతో పొడిచి చంపినట్లు తేలింది. మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన నిందితుడు ఇంటికి తాళం వేసి, ఆమె మొబైల్ తీసుకుని పారిపోయడాని చెప్పారు. ప్రస్తుతం నిందితుడిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.

Exit mobile version