Site icon NTV Telugu

ఐదేళ్ల కొడుకును ఐదు ముక్కలుగా నరికిన తండ్రి.. ఎందుకంటే..?

madya pradesh

madya pradesh

ప్రపంచం రోజుకో రంగు పులుముకొంటోంది. టెక్నాలజీ హై స్పీడ్ తో దూసుకుపోతోంది.. అయినా కొంతమంది మాత్రం ఇంకా మాయలు, మంత్రాలు.. తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా మారి ప్రాణాలను బలితీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాంత్రిక మహిళ చెప్పిందని ముందు వెనుక ఆలోచించకుండా కన్న కొడుకును హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం రేపుతోంది.

వివరాలలోకి వెళితే.. అలీరాజ్‌పూర్‌కు చెందిన దినేష్ ‌అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ, కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.. ఇటీవల అతని ఐదేళ్ల చిన్న కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే మూఢనమ్మకాలు ఉన్న దినేష్ బిడ్డను హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఒక మహిళా తాంత్రికురాలి వద్దకు తీసుకెళ్లాడు. ఆమె బిడ్డకు దెయ్యం పట్టిందని, అది పోవాలంటే బాలుడుని గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి గోతిలో పాతిపెట్టాలి.. అని చెప్పింది. దీంతో అతడు ముందు వెనుక ఆలోచించకుండా ఆ మహిళ చెప్పినట్లు కన్నకొడుకును గొడ్డలితో ఐదు ముక్కలు చేసి గోతిలో పాతిపెట్టాడు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి చివరకు పోలీసుల వద్దకు చేరింది. దీంతో వెంటనే పోలీసులు దినేష్ ని అరెస్ట్ చేశారు. తాంత్రిక మహిళ చెప్పడంతో తాను ఇలా చేశానని చెప్పడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version