Crime News: చికెన్ కూర వండలేదని.. భర్త ఏం చేశాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారినే కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు చికెన్ కూర వండలేదని, తన భార్యని అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కెంచప్ప, షీలా అనే జంట 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బన్నికోడు గ్రామంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది.
అయితే, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వేరెవరితోనో ఎఫైర్ పెట్టుకుందని కెంచప్పకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి గతంలోనే వివాహమైందన్న విషయం తెలియడంతో.. వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తాళలేక షీలా తన పుట్టింటికి వెళ్లిపోయింది. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు పలుసార్లు పంచాయతీ కూడా నిర్వహించారు. కానీ, షీలా మాత్రం భర్త వద్దకు వెళ్లనని మొండికేసింది. తనకు భర్త వేధింపుల్ని తాను భరించలేనని, పుట్టింట్లోనే ఉంటానంటూ అక్కడే ఉండిపోయింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
కట్ చేస్తే.. కూతురు పుట్టినరోజు రావడంతో పుట్టింట్లో ఉంటోన్న షీలా బుధవారం రాత్రి భర్త ఇంటికి వెళ్లింది. అప్పటికే పీకల్లోతు తాగేసి ఉన్న కెంచప్ప.. తనకు చిల్లి చికెన్ వండి పెట్టాలని కోరాడు. కానీ, షీలా వండలేదు. దీంతో వీరి మధ్య మళ్లి గొడవ మొదలైంది. తీవ్ర కోపాద్రిక్తుడైన కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా చంపేశాడు. మత్తు దిగిన తర్వాత, తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో, అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!