Man Killed His Brother For Extramarital Affair In Tirupati: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కొంతమంది వావివరసలు మరిచి, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ పచ్చని కాపురాల్లో తామే నిప్పు పెట్టుకుంటున్నారు. తాము చేస్తోంది తప్పని తెలిసినా, పట్టుబడితే దారుణలు జరుగుతాయని తెలిసినా.. కామంతో కళ్లు మూసుకుపోయి హద్దులు మీరుతున్నారు. అలా హద్దులు దాటినందుకు తాజాగా ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. తల్లితో సమానమైన వదినతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు.. తమ్ముడ్ని అన్నయ్య అత్యంత కిరాతకంగా చంపాడు. తిరుపతిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో బాలాజీ, ప్రతాప్ అనే ఇద్దరు సోదరులున్నారు. వీళ్లు ఒకే తల్లి కడుపున పుట్టారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లై.. వేర్వేరు కాపురాలు పెట్టారు. అయితే.. కొంతకాలం క్రితం ప్రతాప్ భార్య మరణించింది. దీంతో అతడు ఒంటరివాడు కావడంతో.. అన్న బాలాజీ చేరదీశాడు. తన ఇంట్లో ఆసరా ఇచ్చాడు. అందుకు అతడు కృతజ్ఞతగా ఉండకుండా.. తన అన్నయ్య భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ప్రతాప్. ఇలా చేయడం తప్పని తెలిసినా.. కామంతో కళ్లు మూసుకుపోయిన వదిన కూడా మరిదితో వివాహేతర సంబంధం నెరిపింది. ఇంట్లో బాలాజీ లేనప్పుడల్లా.. వీళ్లు రాసలీలల్లో మునిగి తేలేవారు. ఇంట్లో బాలాజీ ఉన్నప్పుడు మాత్రం, ఏమీ ఎరుగనట్టుగా నటించేవారు. అయితే, ఒక రోజు వీళ్లు ప్రతాప్‌కి అడ్డంగా దొరికిపోయారు.
రోజులాగే ఇటీవల బాలాజీ పొలానికి వెళ్లి, తిరిగి ఇంటికొచ్చేశాడు. ఇటు వదిన, మరిది ఏమో.. అతడు ఇప్పుడప్పుడే ఇంటికి రాడనుకొని రాసలీలల్లో మునిగిపోయారు. కానీ, బాలాజీ త్వరగా పనులు ముగించుకొని ఇంటికొచ్చేశాడు. అప్పుడు వారి బాగోతం కంటపడింది. బెడ్ మీద వాళ్లిద్దరిని అసహజ పద్ధతిలో చూసి, అతడు తట్టుకోలేకపోయాడు. ఆ కోపంలోనే పక్కనే ఉన్న కర్ర తీసుకొని, తమ్ముడిపై దాడి చేశాడు. తలపై బలమైన గాయం కావడంతో.. ప్రతాప్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని, ఆధారాలు సేకరించి, బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
