NTV Telugu Site icon

Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..

Man Killed By Woman

Man Killed By Woman

Man Killed By Married Woman Due To Extramarital Affair In Kadapa: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. పచ్చని కాపురాలు కూలిపోయాయి. కొందరి ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు ఓ యువకుడు కూడా.. ఈ వివాహేతర సంబంధానికి బలి అయ్యాడు. వరుసకు అత్త అయ్యే మహిళే అతడ్ని హతమార్చింది. తనతో ఎఫైర్ పెట్టుకొని, మరో యువతితో పెళ్లి ఎలా చేసుకుంటావంటూ.. కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Fight In Marriage: పెళ్లిలో వింత ఘటన.. ఫోటోల కోసం దబిడిదిబిడి

జిల్లాలోని రాజుపాళెంతో పర్లపాడు నరసమ్మ అనే మహిళ నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నరసమ్మ తన కుమార్తెను పక్క వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్దదస్తగిరి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. అతనికి తల్లి మాబున్ని, తమ్ముడు చిన్నదస్తగిరి (28) ఉన్నారు. ఈ క్రమంలోనే నరసమ్మకు, చిన్నదస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. చాలాకాలం నుంచి భర్త లేకుండా ఒంటరిగా ఉన్న నరసమ్మ, చిన్న దస్తగిరిపై మనసు పారేసుకొని, అతనితో రిలేషన్ పెట్టుకుంది. నలుగురికీ తెలియకుండా, తమ ఎఫైర్‌ని కొనసాగించారు.

Gold Rates Today: గోల్డ్ కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర

అయితే.. చిన్న దస్తగిరికి కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నరసమ్మ తట్టుకోలేకపోయింది. చిన్న దస్తగిరి తనకే సొంతమని భావించి, అతడ్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. తమది వ్యామోహం మాత్రమేనని, ప్రేమ కాదని చెప్పాడు. ఆ మాటతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో.. తనకు దక్కని చిన్న దస్తగిరి మరెవ్వరికీ దక్కకూడదని, అతడ్ని చంపడానికి సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం దస్తగిరి ఇంటికి వెళ్లి, తాను ఉండగానే మరొక మహిళతో పెళ్లికి ఎలా సిద్ధమయ్యామంటూ నిలదీసింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Lady Fraud in SrikalaHasti: శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ ఘరానా మోసం.. లాడ్జీకి తీసికెళ్ళి..

ఈ క్రమంలోనే కోపాద్రిక్తురాలైన నరసమ్మ.. కత్తి తీసుకొని చిన్నదస్తగిరిని పొడిచింది. విచక్షణారహితంగా కత్తితో దాడి చేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం నరసమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న కొడుకుని చూసి.. తల్లి మాబున్ని తల్లడిల్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేయగా.. నరసమ్మే అతడ్ని అంతమొందించిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేల్చారు.