NTV Telugu Site icon

Bihar Car Accident: ఢిల్లీ తరహా మరో హారర్ ఘటన.. 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

Man Crushes To Death

Man Crushes To Death

Man Drags 70 year Old On Cars Bonnet For 8KM In Bihar Crushes Him To Death: న్యూఇయర్ సందర్భంగా.. ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే బిహార్‌లో చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో తొలుత మృతుడు కారు ముందు భాగం బానెట్‌పై పడిపోయాడు. ఒకవేళ డ్రైవర్ తన కారుని ఆపి ఉంటే, ఆయన బ్రతికేవాడు. కానీ.. నిందితుడు తన కారుని ఆపకుండా ర్యాష్‌గా వెళ్లిపోయాడు. అనంతరం ఆ వ్యక్తిపై నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బిహార్‌లోని చంపారన్‌ జిల్లా జాతీయ రహదారిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Road Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడానికి రోడ్లు బాగుంటమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే విశ్లేషణ

బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్‌ చౌధర్‌ (70) అనే ఓ వృద్ధుడు ఎన్‌హెచ్27 రహదారిపై సైకిల్‌పై వెళ్తున్నాడు. బాంగ్రా చౌక్‌ సమీపంలోని ఆయన రహదారిని దాటుతుండగా.. గోపల్‌గంజ్‌ పట్టణం నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై వృద్ధుడు ఆ కారు బానెట్‌పై పడిపోయాడు. అది చూసి కూడా.. డ్రైవర్ తన కారు ఆపకుండా నిర్లక్ష్యంగా పోనిచ్చాడు. అలా 8 కిలోమీటర్ల వరకు ఆ వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. అనంతరం సడెన్ బ్రేక్ వేసి, ఆ వృద్ధుడు కిందపడిపోయేలా చేశాడు. కనీసం అప్పుడైనా ఆ డ్రైవర్ మానవత్వం ప్రదర్శించకుండా.. ఆ వృద్ధుడు తనపై కేసు పెడతాడేమోనన్న భయంతో, ఆయనపై నుంచే కారుని తీసుకెళ్లిపోయాడు. దీంతో.. ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు.

Shoaib Akhtar: బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా.. తీస్తే కఠిన చర్యలు తప్పవు

చుట్టుపక్కల స్థానికులు ఈ ఘటనని గమనించి, ఆ కారుని ఆపేందుకు ప్రయత్నించారు. కొందరు ఆ కారుని వెంబడించారు కూడా! కానీ ఆ డ్రైవర్‌ మరింత స్పీడ్‌గా కారుని పోనివ్వడంతో.. అతడు చేతికి చిక్కలేదు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి, ఆ కారుని పిప్రకోఠి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇతరులు సైతం పరారైనట్టు సమాచారం. ఆ కారు యజమానిని ట్రేస్‌ చేసి, ఈ ఘటన గురించి విచారిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Himanta Biswa Sarma: నిన్న షారుఖ్ తెలియదన్నారు.. ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు