Site icon NTV Telugu

DJ Death: ప్రాణం తీసిన డీజే.. భార్యతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త..

Dj Death

Dj Death

DJ Death: ఇప్పటికే ఎంతో మంది డీజే సౌండ్స్‌తో ప్రాణాలు విడిచారు.. డీజే భారీ శబ్ధాల మధ్య హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి కన్నుమూస్తున్నారు.. ఇక, డీజేలకు పర్మిషన్‌ లేదని ఎప్పటికప్పుడు పోలీసులు స్పష్టం చేస్తున్నా.. అక్కడ ఇంకా వాడుతూనే ఉన్నారు.. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో విషాదాన్ని నింపింది డీజే..

Read Also: Netanyahu: హమాస్ ఇంకా అంతం కాలేదు.. శాంతి చర్చల వేళ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

పెందుర్తిలో డీజే సౌండ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.. దీంతో, స్థానికంగా విషాదం నెలకొంది.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో డీజే ఏర్పాటు చేశారు.. ఈ ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిన త్రినాథ్ (56) అనే వ్యక్తి మృతిచెందాడు.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు త్రినాథ్.. కొద్దిసేపటి తర్వాత డ్యాన్స్‌ చేస్తూ పక్కకు వెళ్లి నేలకొరిగాడు త్రినాథ్.. పెందుర్తి సమీపంలోని పెదగాడిలో ఈ ఘటన జరిగింది.. దీంతో, ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, డీజే సౌండ్‌కి ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు పోలీసులు.

Exit mobile version