Site icon NTV Telugu

Man Chops Nose: గార్డెన్‌లో పూలు కోసినందుకు మహిళ ముక్కు కోసిన వ్యక్తి..

Belagavi

Belagavi

Man Chops Nose: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తోటలో పిల్లలు పూలు కోసినందుకు ఓ వ్యక్తి మహిళ ముక్కు కోశాడు. ఈ ఘటన బెలగావిలోని బసుర్తే గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నిందితుడు కళ్యాణి మోరే, అంగన్ వాడీ కార్యకర్త సుగంధ మోరే(50)తో గొడవపడి, ఆమె ముక్కును నరికాడు.

సుగంధ మోరే పిల్లలు తన తోటలో పూలు కోశారని కళ్యాణి మోరే ఆమెతో గొడవకు దిగాడు. ఆవేశంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన సుగంధను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం వేట సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Argentina President Kissing Video: స్టేజ్ పై రొమాన్స్ తో రెచ్చిపోయిన అర్జెంటీనా అధ్యక్షుడు.. యూ నాటీ

ఈ ఘటనపై కాకతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంగన్‌వాడీ పిల్లలు ఆడుకుంటూ పక్క ఇంటి ఆవరణలో పెంచిన మల్లెపూలు కోశారు. దీంతో కళ్యాణి మోరే కొడవలితో సుగంధ మోరే ముక్కు కోశాడు. ఈ ఘటనలో ముక్కు భాగం చాలా వరకు తెగిపోయింది. తీవ్రరక్త స్రావం కావడంతో పాటు ఊపిరితీసుకున్న సమయంలో రక్తం లంగ్స్‌లోకి చేరింది. ప్రస్తుతం మహిళ ప్రాణాల కోసం పోరాడుతోంది.

Exit mobile version