Site icon NTV Telugu

Dowry Harassment: పెళ్లయిన 4 నెలలకే.. వరకట్న దాహానికి నవ వధువు బలి..

Dowry Harassment

Dowry Harassment

Dowry Harassment: వరకట్న దాహానికి మరో మహిళ బలైంది. పెళ్లయినప్పటి నుంచి అత్తామామల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని జల్గావ్ లో జరిగింది. 23 ఏళ్ల మయూరి గౌరవ్ తోసర్ ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత, ఆమె పుట్టినరోజు తర్వాతి రోజు బలవన్మరణానికి పాల్పడింది.

Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దాతృత్వం.. 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం..

మయూరిని గత కొన్ని రోజులుగా అత్తమామలు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయని, అయినా కూడా వేధింపులు ఆగలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అత్తమామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబం పోలీసులను డిమాండ్ చేసింది.

Exit mobile version