మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో అమావాస్య రాత్రులలో ఓ వ్యక్తి చాలా అసహ్యకరమైన పనులు చేస్తున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖాండ్వా జిల్లా కబ్రస్తాన్ లో అయూబ్ ఖాన్ అనే వ్యక్తి స్మనాన వాటికలో పగటి పూట మహిళ సమాధులను వెతికి.. రాత్రి వేళలో తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో.. అందరు షాక్ కు గురయ్యారు. అంతేకాక అతడిని అసహ్యించుకుంటున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో, అమావాస్య రాత్రి మహిళల సమాధులపై అయూబ్ ఖాన్ అమానుష చర్యలకు పాల్పడ్డాడు. నిందితులు సమాధులను తవ్వి మృతదేహాలపై అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారు, ఈ సంఘటన షాక్‌కు గురిచేసింది. గతంలో అయూబ్ ఖాన్ తన ఇద్దరు భార్యలను చంపాడు. అతనిపై ఇప్పటికే 11 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అమావాస్య రాత్రులలో సమాధులు తవ్వడానికి వెళ్లేవాడు. పగటిపూట, అతను మహిళల కొత్త సమాధుల కోసం వెతుకుతూ, రాత్రి టైంలో వికృత లైంగిక చర్యలకు పాల్పడేవాడు. ఇప్పటికే మూడు సమాధులపై మంత్రవిద్యతో ప్రయోగాలు చేసినట్లు కూడా తెలిసింది.
మే 19 ,సెప్టెంబర్ 21 తేదీలలో బడా కబ్రస్తాన్‌లో మృతదేహాలను ముక్కలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, ముండ్వారాకు చెందిన 50 ఏళ్ల అయూబ్ ఖాన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని సంఘటనా తీసుకెళ్లి సీన్ రీ క్రియేషన్ చేస్తుండగా. ముస్లిం సమాజానికి చెందిన పెద్దలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. నిందితులను తమకు అప్పగించి డిమాండ్ చేశారు.
