Site icon NTV Telugu

Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు

Untitled Design (7)

Untitled Design (7)

మధ్యప్రదేశ్లో ఓ యువకుడు మహిళను చంపి రెండ్రోజులు సమాధి పైనే పడుకున్నాడు. యువకుడి వింత ప్రవర్తన పోలీసులు, స్థానికులు విస్తు పోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also:shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ…

పూర్త వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో తన ప్రియురాలిని హత్య చేసి.. సమాధి దగ్గరే రెండు రోజులు పడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడి రతిరాం రాజ్ పుత్ రీసెంట్ గా పెళ్లైన తన ప్రేయసిని ముందు రోజు రాత్రి తన ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరు ఎంజాయ్ చేసిన అనంతరం ఆమె మెడకు టవల్ చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ముకేష్, జ్ఞాన్ సింగ్ తో కలిసి శవాన్ని పాతి పెట్టాడు. సమాధిని బురద, ఆవు పేడతో నింపేశాడు. అనంతరం సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు.

యువతి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో రతిరాం అనే యువకుడితో యువతి సన్నిహితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రతిరాం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. యువతి.. తన భర్తను వదిలేసి వచ్చేస్తానని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా రతిరాం పై ఒత్తిడి పెడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగించలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.

Read Also:UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు

యువతిని బ్లేడుతో కోసి, కరెంటు షాకిచ్చి, మెడకు ఉరి బిగించి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అరెస్టైన రెండు రోజులకే నిందితుడు రతిరాం బయటకు వచ్చాడు. బాధితులు ఫిర్యాదుతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రతిరాంను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version