Site icon NTV Telugu

Madhya Pradesh : దారుణం.. ఆడపిల్ల పుట్టలేదని పసికందును చంపేసిన తండ్రి..

Crime News

Crime News

ఎక్కడైన ఆడపిల్ల పుట్టిందని చంపేసే తండ్రులను మనం చూసే ఉంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టలేదని 12 రోజుల కొడుకును అతి దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి.. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్​ బేతుల్​ జిల్లాలోని బజ్జార్​వాడ్​ అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. అనిల్​ ఊయికే అనే వ్యక్తి, తన కుటుంబంతో కలిసి ఓ గుడిసే నివాసముంటున్నాడు. కాగా.. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది.. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. అతన భార్య ఇటీవలే మూడో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం అనిల్​కి నచ్చలేదు. మూడో బిడ్డగా ఆడపిల్ల కావాలనుకుని, చాలా ఆశలు పెట్టుకున్నాడు అనిల్​. కానీ మూడోసారి కూడా మగబిడ్డే పుట్టడంతో అసంతృప్తి చెందాడు..

ఈ విషయం పై తన భార్యతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం.. ఆ గొడవ మరింత తీవ్రమైంది. మద్యం మత్తులో ఉన్న అనిల్​.. విక్షణారహితం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. భార్యను కొట్టాడు. ఆమెపై దాడి చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.. అయితే కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగెళ్లిన మహిళ.. షాక్​కు గురైంది. 12 రోజుల పసికందు విఘతజీవిగా పడి ఉండటాన్ని చూసి బాధపడింది.. బిడ్డ గొంతు మీద ఎర్రని గుర్తులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి స్టైల్లో విచారించగా అస్సలు విషయం బయట వచ్చింది.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది..

Exit mobile version