Lucky Draw Lottery Fraud In Nizamabad: మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలీచాలని జీతంతో కుటుంబం బాధ్యతలు మోస్తూ.. చాలా కష్టంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్లందరూ తమ తలరాతను మార్చే అదృష్ట ఘడియల కోసం ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు. వాళ్ల ఈ అవసరాన్నే కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని నిండా దోచేసి, డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు కూడా అలాంటి మోసానికే పాల్పడ్డాడు. మధ్య తరగతి వారిని టార్గెట్ చేసి, లక్కీ డ్రా ఆశ చూపి, ఏకంగా రూ. 72 లక్షలు దోచేసుకున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రెండేళ్లు గడిచినా, పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్‌లో దీన్ని వ్యతిరేకిస్తాం
కొన్నేళ్ల క్రితం ఫిరోజ్ అనే వ్యక్తి షైన్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఒక సంస్థని ప్రారంభించాడు. ఇది ఒక లక్కీ డ్రా అని, నెలకు రూ.1000 చొప్పున డబ్బులు కడితే.. లక్కీ డ్రా వచ్చిన వాళ్లు భారీ డబ్బులు అందుకోవచ్చని ఆశ చూపించాడు. ఇదేదో బాగుంది కదా అని మధ్య తరగతి వారు అతడు చెప్పినట్టుగానే నెలకు రూ.1000 చొప్పున కట్టారు. ఇలా మొత్తం 350 మంది 20 నెలల పాటు లక్కీ లాటరీకి డబ్బులు కట్టారు. ఈ విధంగా అందరి వద్ద నుంచి రూ.72 లక్షలకు పైగా డబ్బులను వసూలు చేశాడు. సరైన సమయం కోసం వేచి చూసిన ఫిరోజ్.. అందరికీ శఠగోపం తొడిగించి, ఆ డబ్బులతో ఉడాయించాడు. ఎక్కడా అతని జాడ కనిపించకపోవడం, ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో.. ఫిరోజ్ తమని మోసం చేశాడని బాధితులు గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో ఇతని బాధితులు ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి న్యాయం చేయాలని వీళ్లు పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో, బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్