NTV Telugu Site icon

Mulugu: బ్రౌన్ క‌ల‌ర్ సంచీలో చిరుత పులి చ‌ర్మం..

Mulugu

Mulugu

Mulugu: చిరుత పులి చ‌ర్మాన్ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండ‌లం చంద్రుప‌ట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రం నుండి చిరుత పులి చ‌ర్మాన్ని తీసుకుని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అమ్మ‌డానికి వ‌స్తున్నాడ‌న్న విశ్వ‌స‌నీయ స‌మాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వాజేడు మండ‌లం చంద్రుప‌ట్ల గ్రామ క్రాస్ రోడ్ వ‌ద్ద ఈ మేర‌కు వెంక‌ట‌పూరం సీఐ బండారి కూమార్‌, పేరూర్ ఏస్ఐ గుర్రం కృష్ణ ప్ర‌సాద్‌, వాజేడు అట‌వీ శాఖ అధికారి బి.చంద్ర‌మౌళి త‌దిత‌ర సిబ్బందితో క‌లిసి కాపుకాశారు. మధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో త‌నికీలు నిర్వ‌హిస్తుండ‌గా ఒక వ్య‌క్తి ద్విచ‌క్ర వాహ‌నంపై చత్తీస్ ఘ‌డ్ వైపు నుండి వ‌స్తుండ‌గా అనుమానస్ప‌దంగా క‌నిపించాడు. త‌నికీ చేయ‌గా అత‌ని వ‌ద్ద గ‌ల‌ బ్రౌన్ క‌ల‌ర్ సంచీలో చిరుత పులి చ‌ర్మం చూసి షాక్ అయ్యారు. పంచ‌నామ నిర్వ‌హించి చిరుత పులి చ‌ర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిరుత పులి చ‌ర్మాన్ని త‌ర‌లించి అమ్ముకోవాడానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా గుర్తించారు. ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాల‌ప‌ట్నం మండలం ఉల్లూరు అనే గ్రామానికి చెందిన జాడి మ‌హేందర్ (40) తండ్రి రామ‌య్య గా గుర్తించారు. నిందితుడు మహేందర్ నుంచి పులి చ‌ర్మం, సామ్ సంగ్ మోబ‌ల్‌, రిజిస్ట్రేష‌న్ లేని ద్విచ‌క్ర వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Zee Telugu : ‘సరిగమప సీజన్ 16’ ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.. స్టార్ట్ ఎప్పుడంటే..?