Site icon NTV Telugu

National Flag: ఉత్తర్ ప్రదేశ్ లో జాతీయ జెండాకు అవమానం.. త్రివర్ణ పతాకాన్ని తొలగించి….

Sam (9)

Sam (9)

ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను తొలగించి.. కొందరు దుండగులు ఇస్లామిక్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురు పేరున్న వ్యక్తులు , నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

లఖింపూర్ ఖేరీలో ఫూల్‌బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా అలీగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఇస్లామిక్ జెండాను ఎగురవేసిన కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదతో ముగ్గురు నిందితులతో సహా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తీవ్రం కావడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
గ్రామంలోని కొంతమంది యువకులు లఖా-అలిగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల పైకప్పుపైకి ఎక్కారు. వారు అక్కడి నుండి త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఇస్లామిక్ జెండాను పెట్టారని ఆరోపించారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు నిరాకరించడంతో వారిపై దుర్భాషలాడి, బెదిరించినట్లు సమాచారం.

అదే గ్రామానికి చెందిన సంజయ్ త్రివేది వీడియో తీసి ఫూల్‌బెహాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు.. దీని తర్వాత, పోలీసులు సద్దాం, బస్రు, అనన్నే అనే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జెండా ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఉద్దేశ్యంతో ఎగురవేశారు అనేది దర్యాప్తులో మాత్రమే వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.

Exit mobile version