Site icon NTV Telugu

Tirupati: గూడూరు హత్య కేసులో మరో లేడీ డాన్ పాత్ర.. ఈమె దందా ప్రత్యేకత ఇదే!

Lady Don

Lady Don

తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం జరిగిన హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. ఈ కేసులో మరో లేడీ డాన్ వందన పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో హంతక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్ చేతిలో కత్తులు పట్టుకుని దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో షేక్ రహీద్ (35) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం శ్మశాన వాటికలో శవమై కనిపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతనం మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఇక న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో లేడీ డాన్ వందన హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. ఈమె గంజాయి బ్యాచ్‌ను చేరదీసి వాళ్లతో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు కనిపెట్టారు. టిడ్కో గృహసముదాయాల దగ్గర వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వందన దుర్మార్గాలు గురించి ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయగా వందన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లేడీ డాన్ వందనతో పాటు మరో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వందన గురించి తప్పుగా మాట్లాడడంతోనే రహీద్‌ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్యపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version