NTV Telugu Site icon

Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్‌చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!

Tagarapuvalasa Murder Case

Tagarapuvalasa Murder Case

Man Kills a woman brutally in tagarapuvalasa: మహిళల రక్షణకోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా అవన్నీ పేరుకే అన్నట్టు ఉంది పరిస్థితి. దేశంలో ప్రతి రోజూ అనేక రకాల కేసులు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయం ఉన్న మహిళను అత్యంత దారుణంగా చంపిన ఘటన సంచలనం రేపుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇటీవల తగరపువలసలో జరిగిన ఒక వివాహిత దారుణ హత్య వెనుక ఉన్న విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే కేరళకు చెందిన 37 ఏళ్ళ ఓలికల్‌ ప్రదీస్‌ పదో తరగతి వరకూ చదువుకుని ఫ్యాబ్రికేషన్‌ వర్క్స్ చేస్తూ ఉండేవాడు. ప్రదీస్ ఆరేళ్ల కిందట విశాఖ జిల్లా చిప్పాడలోని ఒక కంపెనీలో ఫ్యాబ్రికేషన్‌ పనుల్లో చేరాడు. ప్రదీస్ కు భార్య, మూడేళ్లు, ఏడాది వయస్సున్న ఇద్దరు సంతానం కూడా ఉండగా వారితో కలిసి తగరపువలస గొల్లవీధి ఆదర్శనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. గతంలో భార్య ఊరెళ్లినపుడు ఓ మహిళతో ఏకాంతంగా గడిపాడు. ఇక అయిదు రోజుల కిందట కూడా భార్యపిల్లలు ఊరు వెళ్లడంతో ప్రదీస్‌ మరోమారు ఆమెకు ఫోన్‌చేసి పిలిచాడు.
Raviteja: స్పీడుమీదున్న మాస్ మహారాజ.. ‘సితార’కి గ్రీన్ సిగ్నల్?
ఆమె రావడం అయితే వచ్చింది కానీ ఇద్దరికీ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో ఆ మహిళ అతని కుటుంబ సభ్యులను మీద అసభ్యంగా దూషించింది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న ప్రదీస్‌ ఆమెను భవనంపై నుంచి కిందకి తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉంది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సింది పోయి గొంతు నొక్కి చంపేశాడు. అయితే మత్తు దిగాక ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా బరువుగా ఉంది. ఈ క్రమంలో అలోచించి మర్మాంగాలు సహా పలు శరీర భాగాలను కోసేసి రక్తం అంతా బయటకు పోయేలా చేసి ఆ రక్తం మరకలు కనపడకుండా ఇంటి గచ్చుతో పాటు మృతదేహానికి కూడా రెడ్ కలర్ పెయింట్ పూశాడు. ఆ తరువాత ఎవరూ లేరని భావించే ఒక నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి తిరిగి వస్తుండగా గోతిలో పడిపోవడంతో బైక్‌ పార్టులు కొన్ని విరిగిపడ్డాయి. ఆ సమయంలో చూసిన ఓ మహిళ అతని బండి నెంబరును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందించింది. ఈ క్రమంలో ప్రదీస్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది