Site icon NTV Telugu

Kerala : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ జీపు.. 8 మంది మృతి..

kerala accdent

kerala accdent

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.. జీపులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ప్రమాదం వయనాడ్ దగ్గర జరిగింది.. కూలీల తో ప్రయాణిస్తున్న జీపు లోయలో పడింది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు… గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు టీఎస్టేట్ లో పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో జీపు మొత్తం ధ్వంసం అయింది. లోయలో పడిన తాకిడికి జీపు రెండుగా చీలి పోయింది. శుక్రవారం 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. రెస్క్యూ టీమ్స్ సాయం తో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం వయనాడ్ ఆస్పత్రికి తరలించారు..

ఈ ప్రమాదం లో మృతి చెందిన వారంతా కూడా టీ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ను ప్రమాదస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్సతో పాటు అన్నీ రకాల సాయం చెయ్యాలని తెలిపారు.. ప్రస్తుతం క్షత గాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version