Karnataka: భర్తగా భార్యను కలకాలం కాపాడాల్సిన వాడే రాక్షసుడిగా ప్రవర్తించాడు. పెళ్లి తర్వాత తనకు తోడుగా ఉంటాడనుకున్న వాడే దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లి ముందు ఉద్యోగం ఉందని నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.
Read Also: Janhvi Kapoor: కాటుక కళ్ళు అందం తో మాయచేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..జాన్వీ కపూర్
వివరాల్లోకి వెళ్లే 28 ఏళ్ల యువతితో నిందితుడికి గతేడాది నవంబర్ నెలలో వివాహం జరిగింది. వీరిద్దరు హనీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లారు. ఆ సమయంలో భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను, ఫోటోలను తీశాడు నిందితుడు. అక్కడ కొన్ని పోర్న్ చిత్రాలు చూపించి, మద్యం తాగించి, తన వివరాలన్నింటిని తన భర్త సెల్‌ఫోన్ లో అప్డోల్ చేసుకున్నాడని బాధిత మహిళ బసవనగుడి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.
బెంగళూర్ తిరిగి వచ్చిన తర్వాత తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని, ప్రతీ నెలా వచ్చే జీతాన్ని తనకే ఇవ్వాలని ఉద్యోగం చేస్తున్న భార్యను బెదిరించడం ప్రారంభించాడు.డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించే వాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన నిందితుడికి, అసలు ఉద్యోగమే లేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
