KARNATAKA WIFE DRAMA: భర్త.. భార్య.. మధ్యలో ప్రియుడు
- బట్టలు, చెప్పులు వదిలేసి ప్రియుడితో పారిపోయిన ప్రియాంక..
- ఒంటి మీద రూ. 30 లక్షల విలువైన నగలు..
- బంగారం కోసమే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KARNATAKA WIFE DRAMA: వివాహేతర బంధం కోసం ప్రియుడి సాయంతో భర్తను చంపుతున్న ఘటనలు ఈ మధ్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఐతే అలాంటి కేసుల్లో చాలా వరకు ప్రియుడితోపాటు భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసులన్నింటినీ చూసిన ఓ భార్య.. తన భర్తను చంపకుండానే.. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ఓ డ్రామాటిక్ స్కెచ్ వేసింది. ఇటు భర్తను హత్య చేయకుండా.. అటు నైస్‌గా ప్రియుడితో వెళ్లిపోవడం వల్ల.. విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుందని భావించింది. కానీ సీన్ రివర్స్ అయి పోలీసులకు దొరికిపోయింది. ఐతే భార్య చేసిన పనికి ఆ భర్త షాకయ్యాడు. ఈ కేసులో అసలేం జరిగింది? భార్య ఏం చేసింది?
Read Also: Nilave: మ్యూజికల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటున్న నెలవే
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ముందుగా అందరూ చేసిన విధంగానే భర్తను చంపేసి..ప్రియుడితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంది. కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత సీన్ అంతా రివర్స్ అవుతుందని భావించి ప్లాన్‌లో చిన్న చేంజ్ ఇచ్చింది. కానీ అలా చేసినా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రియాంక. తుమకూరులో భర్త రుద్రేష్‌తో కలిసి నివసిస్తోంది. ఈ ఠక్కులాడికి డేవిడ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేద్దామంటే భర్త రుద్రేష్ అడ్డుగా ఉన్నాడు. దీంతో అతన్ని హతమార్చాలని ప్రియాంక ప్లాన్ చేసింది. ఐతే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు గుబులు పుట్టించాయి. దీంతో ప్రియుడ్ డేవిడ్ ప్లాన్ మార్చేశాడు.
తుమకూరులోని ఓ చెరువు వద్ద ప్రియాంక బట్టలు, చెప్పులు వదిలేసి ప్రియుడుతో కలిసి పారిపోయింది. ఐతే రుద్రేష్ భార్య కోసం ఫోన్ చేశాడు. కానీ స్విచ్చాఫ్ వచ్చింది. తెలిసిన వారి ఇళ్లు, బంధువులు వద్ద వాకబు చేశాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన అతడు.. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఒంటి మీద దాదాపు 30 లక్షల రూపాయల విలువైన నగలు ఉన్నాయని తెలిపాడు. ఆ బంగారం కోసమే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేశారు. ఇంతలో పోలీసులకు బేలూరు బస్టాండ్ వద్ద సీసీ ఫుటేజీలో ప్రియాంక కనిపించింది. ఆ ఆధారంతో వెతకడంతో ఓ చెరువు వద్ద ఆమె దుస్తులు, చెప్పులను గుర్తించారు. చెరువు వద్ద భార్య దుస్తులు, చెప్పులు చూసి భర్త రుద్రేష్ మరింత ఆందోళనకు గురయ్యాడు. ఆమెను చంపేశారని అని అనుకున్నాడు. కానీ పోలీసులు చెరువులో వెతకడంతో ఎలాంటి డెడ్ బాడీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. చివరికి సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రియుడితో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రియుడు డేవిడ్‌తోపాటు ప్రియాంకను అరెస్ట్ చేశారు. భార్య చేసిన నిర్వాకం బయట పడడంతో భర్త రుద్రేష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!