NTV Telugu Site icon

Karnataka : విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని మృతి చెందిన 8 నెలల చిన్నారి..

Karnaaka (4)

Karnaaka (4)

జీవితం ఎంత చిన్నది అనేది మనం చెప్పలేము.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అతి కష్టం.. మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో అంచనా వెయ్యలేము.. మన చేతుల్లో లేని పని.. తాజాగా ముక్కు పచ్చలు ఆరని చిన్నారి 8 నెలలకే మృత్యువు ఒడిలోకి వెళ్లింది.. మొబైల్ చార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని విధ్యుత్ ఘాతుకంతో ప్రాణాలను విడిచింది.. ఈ విషాద ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది..ఈ ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..

వివరాల్లోకి వెళితే..కార్వార్ ప్రాంతంలో సంతోష్ హెస్కామ్ (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. ఆయనకు భార్య సంజన, ఎనిమిది నెలల కూతురు సానిధ్య ఉంది. అయితే ఎప్పటిలాగే ఆయన మంగళవాంర కూడా విధులకు వెళ్లే ముందు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. అనంతరం ఛార్జింగ్ తీసి విధులకు వెళ్లారు. కానీ స్విచ్చ్ ఆఫ్ చేయడం చేయడం మర్చిపోయారు. అదే సమయంలో ఇంట్లో కూతురు ఆడుకుంటోంది. ఛార్జర్ వైర్ కిందికి వేలాడుతూ ఉండటంతో ఆ పసి పాప..దానిని నోట్లో పెట్టుకుంది..

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ బాలిక మరణించింది. హాస్పిటల్ కు చేరుకున్న వెంటనే చిన్నారి మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో తమ ముద్దుల కుమార్తెను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.. నెలల చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

Show comments