Basava Siddalinga Swami: కర్ణాటక పీఠాధిపతి బసవ సిద్దిలింగ స్వామి సూసైడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా పీఠాధిపతులా లైంగిక ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు.. ఇక ఈ మధ్యనే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న శివమూర్తి కస్టడీలో ఉన్నాడు. ఇక వీటినే ఇంకా మరువలేని స్థితిలో ఉండగా మరో ఘటన కర్ణాటకను ఒక ఊపు ఊపేస్తోంది. బసవ సిద్దిలింగ స్వామి అనే మఠాధిపతి ఒక విద్యార్థిని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
బెలగావి శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్‌కు చెందిన ఆయన పేరు.. లైంగిక వేధింపులకు గురైన బాధితులు మాట్లాడిన వీడియోలో ఉండడంతో మనస్థాపానికి చెందిన సవ సిద్దిలింగ స్వామి సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక మఱుతదేహం వద్ద సూసైడ్ లెటర్ కూడా పోలీసులకు దొరికింది. అయితే అందులో అతను ఏమి రాసాడు అన్నది పోలీసులు ఇంతవరకు తెలుపకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఎంతో నియమ, నిష్ఠలతో పూజలు చేసే పీఠాధిపతులు ఇలాంటి పనులు చేయడం ఏంటని, ఇలా చేస్తే దేవుడు క్షమించడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
