Crypto Scam : క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పేర్లతో కోట్ల రూపాయల మోసం చేసిన మెటాఫండ్ కింగ్ పిన్ వరాల లోకేశ్వర్‌రావును కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ కు చెందిన తులసీ ప్రకాష్ తో స్నేహం ఏర్పడిన తర్వాత 2024లో ఈ మోసం ప్రారంభమైంది. మెటాఫండ్, యూబిట్ పేర్లతో నకిలీ యాప్‌లు సృష్టించి, పెట్టుబడిదారులను మోసం చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 90,000 రూపాయలకు 1,000 కాయిన్లు ఇస్తామని, నెల రోజులలో మూడు రెట్లు రాబడి వస్తుందని నమ్మించారు.
Chiranjeevi : ఆ విషయంలో చిరు గ్రేట్.. మనసున్న మెగాస్టార్..
ఈ మోసానికి వరాల లోకేశ్వర్‌రావు కింగ్ పిన్ గా ఉండగా, తులసీ ప్రకాష్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో ఘనంగా మెటాఫండ్ యూబిట్ కాయిన్స్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నమ్మకాన్ని పొందారు. దేశవ్యాప్తంగా 450 మందికి పైగా బాధితులు, సుమారు 25 నుండి 30 కోట్ల రూపాయల మోసం జరిగిందని సీపీ తెలిపారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్, బూర శ్రీధర్ ను రిమాండ్‌కు తరలించారు. నిన్న కింగ్ పిన్ లోకేశ్వర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద ఆస్తి పత్రాలు, 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, BMW కారు స్వాధీనం చేశారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
VC Sajjanar : వీసీ సజ్జనార్ సూపర్ షాట్.. దెబ్బకు వీడియోలు తొలగించిన యూట్యూబర్లు