NTV Telugu Site icon

Kanpur Man Threatens Minor: పెళ్లి చేసుకుంటావా.. లేదా ముక్కలుగా నరికేయాలా?

Man Threatens Minor

Man Threatens Minor

Kanpur Man Threatens Minor To Kill After She Rejects Marriage Proposal: ప్రేమపేరుతో యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. ఇష్టం లేదని చెప్పినప్పటికీ.. తమని ప్రేమించాల్సిందేనంటూ యువతుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఒప్పుకోకపోతే మాత్రం చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి అలాంటి బెదిరింపులకే పాల్పడ్డాడు. తనని పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్‌ను తిరస్కరించిందన్న కోపంతో.. ముక్కలు ముక్కలు నరికేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించగా.. అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కాన్పూర్‌కి చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. కొంతకాలం నుంచి స్కూల్‌కి వెళ్తున్న 17 ఏళ్ల యువతిని ఫాలో అవుతున్నాడు. తనని ప్రేమిస్తున్నానని వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. తనకు ఇష్టం లేదని, తన వెంట పడొద్దని ఆ అమ్మాయి ఎంత వేడుకున్నా.. అతడు వినిపించుకోలేదు. దీంతో.. ఆ యువతి తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. గొడవలు ఎందుకులే అనుకొని.. వాళ్లు ఆ అబ్బాయిని మందలించారు. తమ అమ్మాయి జోలికి రావొద్దని, మర్యాదగా చెప్పారు. అయినా అతడిలో మార్పు రాకపోగా.. మరింత రెచ్చిపోయాడు. తనని పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆ యువతిని టార్చర్ చేశాడు. అయితే.. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పెళ్లి చేసుకోను అని ఒక రోజు ఖరాఖండీగా తేల్చి చెప్పింది.

దీంతో కోపాద్రిక్తుడైన ఫయాజ్.. తనని పెళ్లి చేసుకోకపోతే, ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఆ యువతిని బెదిరించాడు. దాంతో భయపడ్డ ఆ యువతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు.. ఫయాజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఫయాజ్‌ను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లినప్పుడు, అతని పేరెంట్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ఏసీపీ అభిషేక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. పోస్కో చట్టం కింద ఫయాజ్‌పై కేసు నమోదు చేశామని, అతడ్ని అరెస్ట్ చేసి జైలుకి పంపామని స్పష్టం చేశారు.

Show comments