చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి.. డిపార్డ్మెంట్ కు మాయని మచ్చ తీసుకువచ్చాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అభాసు పాలయ్యాడు.. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యువతి కానిస్టేబుల్ ను లాక్కెళ్తున వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఉన్న గోల్ చౌరాహాలోని జీటీ రోడ్ సమీపంలో స్టాంప్ పేపర్ కొనేందుకు వచ్చింది ఓ అమ్మాయి. అక్కడికి వచ్చిన బ్రజేష్ అనే కానిస్టేబుల్ యువతి చేతులు లాగుతూ.. సైగల్ చేస్తూ.. లైంగికంగా వేధించాడు. అనంతరం యువతి ఇంటికి వెళ్లి తన, తల్లి, సోదరిని వెంట బెట్టుకుని వచ్చింది. అయితే అక్కడే తిరుగూ కనిపించాడు కానిస్టేబుల్ బ్రజేష్.
Read Also:Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త
వెంటనే ముగ్గురు కలిసి అతన్ని ఫోన్‌తో క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించగా.. ఫోన్ లాక్కున్నాడు. వారిపై దాడి చేశాడు. దీంతో మండిపోయిన యువతి.. అతడి గళ్ల పట్టుకుని రోడ్డుపైకి లాక్కొచ్చింది. ఆ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. యువతి కానిస్టేబుల్ ను తీసుకెళ్లిన వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ అమ్మాయి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. జనాలను రక్షించాల్సిన పోలీసులు ఇలా చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. వెంటనే ఇలాంటి కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
शर्मनाक
कानपुर के गोल चौराहे पर एक लड़की स्टांप पेपर लेने गई थी तभी वहां मौजूद पुलिसकर्मी ने लड़की को छेड़ना शुरू कर दिया और उसके साथ अश्लील हरकत किया
लड़की और लड़की की बहन ने बहादुरी दिखाई, पुलिस वाले का हाथ पकड़ कर खींचते हुए पुलिस चौकी ले गई …रास्ते में पुलिस वाले ने अपना… pic.twitter.com/X2wunUiZGf
— The News Basket (@thenewsbasket) October 29, 2025
