NTV Telugu Site icon

Kannauj rape case: మైనర్ బాలికని రేప్ చేసింది సమాజ్‌వాదీ పార్టీ నాయకుడే.. డీఎన్ఏ మ్యాచ్..

Kannauj Rape Case

Kannauj Rape Case

Kannauj rape case: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత నిందితుడిగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌లోని అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన ఎస్పీ నేత నవాబ్ సింగ్ యాదవ్‌ యొక్క డీఎన్ఏ నమూనా, బాలిక నుంచి సేకరించిన డీఎన్ఏతో మ్యాచ్ అయింది. దీంతో ఈ కేసులో అతడి చుట్టూ మరింత ఉచ్చు బిగిసింది.

Read Also: CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం..

ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ అయిన డింపుల్ యాదవ్‌కి గతంలో నవాబ్ సింగ్ యాదవ్ సహాయకుడిగా పనిచేశారు. మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆగస్టు 12న అతడిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు POCSO చట్టంలోని సెక్షన్ల కింద ఆగస్టు 12న అరెస్ట్ చేసి, 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ఈ కేసులో బాధితురాలు తన బట్టలు విప్పేసి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నవాజ్ సింగ్ యాదవ్‌ని అరెస్ట్ చేశారు. పోలీసులు వెళ్లే సమయానికి అతను అభ్యంతరకరమైన స్థితిలో ఉన్నాడు. అదే గదిలో బాలిక కూడా ఉంది. విచారణలో తన అత్త ఉద్యోగం నిమిత్తం అతడికి ఇంటికి తీసుకెళ్లినట్లుగా చెప్పింది. అయితే, ఈ ఆరోపణల్ని నవాజ్ సింగ్ ఖండించారు. ఇది పెట్టుబడీదారుల కుట్రగా ఆరోపించాడు. ఈ వివాదంపై ఎస్పీ దూరంగా ఉంది.