Juvenile Offenders Escape: బాల నేరస్తులు గోడ దూకేశారు.. !! అధికారుల కళ్లుగప్పి ఏకంగా తాళం పగులగొట్టుకుని పారిపోయారు. సైదాబాద్‌లో ఉన్న జువెనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరారయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయి 15 రోజులైనా పోలీసులు గానీ.. జువెనైల్ హోమ్ సిబ్బంది కానీ.. ఇంకా వారిని పట్టుకోలేదు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న ఐదుగురు బాలురు.. జువైనల్ హోమ్ నుంచి పరారయ్యారు. వీరి వయసు 16 నుంచి 17 ఏళ్ల వరకు ఉంటుంది. జులై 21న రాత్రి అంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో భోజనం చేశారు. ఆ తర్వాత ఈ ఐదుగురు మైనర్ బాలురు ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లారు. జువైనల్ హోమ్ అధికారుల కంట పడకుండా అక్కడ ఉన్న ఇనుప గ్రిల్స్ తాళం తొలగించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు దారి పరారయ్యారు… స్పాట్..
Read Also: Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
ఇక, ఐదుగురు బాలురు పారిపోయిన ఘటనపై జువైనల్ హోమ్‌లో ఉన్న మిగతా బాలురు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జువైనల్ హోమ్ సిబ్బంది.. చుట్టు పక్కల అంతా వెతికారు. కానీ వారి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఐతే ఉదయం జువైనల్ హోమ్ అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు15 రోజులవుతున్నా వారి జాడ కనిపించలేదు. అటు పోలీసులు కానీ.. ఇటు జువైనల్ హోమ్ సిబ్బంది కానీ వారిని పట్టుకోలేకపోయారు. పారిపోయిన ఐదుగురిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారు కాగా.. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
