NTV Telugu Site icon

Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?

Jail Term

Jail Term

Jail Term: సహజంగా ఖైదీలు శిక్షా కాలం ముగియటం కన్నా ముందే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ అప్లికేషన్‌ ఆమోదం పొందితే రిలీజ్‌ అవుతారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఓ ఖైదీ తన శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా దాదాపు నాలుగేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మామాలుగైతే శిక్షా కాలం ముగిసిన ఖైదీలను జైలు అధికారులు వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ ఇతని విషయంలో అలా జరగలేదు.

జైలు సూపరింటెండెంట్‌కి, సెషన్స్‌ జడ్జికి లాయర్‌ ప్రత్యేకంగా లెటర్‌ రాశాక గానీ అతణ్ని విడిచిపెట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎందుకిలా జరిగిందో ఎవరికీ అర్థంకావట్లేదు. పూర్వాపరాలను తెలుసుకునేందుకు హైకోర్టు జడ్జి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. మానవ హక్కుల పరంగా అతనికి జరిగిన నష్టానికి 3 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. బాధితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితుడు చేసిన డిమాండ్‌లో వంద శాతం న్యాయం ఉందని చెప్పారు.

Life Insurance Corporation: ఎల్ఐసీకి ఏమైంది?. 1.21 లక్షల కోట్లు కోల్పోయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి పేరు జస్టిస్‌ ఎస్‌ఏ ‘ధర్మాధికారి’ కావటం గమనించాల్సిన విషయం. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఆయన అన్నారు. ఖైదీ విడుదల ఉత్తర్వులను జారీ చేయాల్సిన బాధ్యత ‘ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిదే’ అని స్పష్టం చేశారు. ఈ మొత్తం తతంగంలో అసలు ఏం జరిగిందో దర్యాప్తు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ‘రిజిస్ట్రార్‌-విజిలెన్స్‌’ని ఆదేశించారు. ఈ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చింద్వారా జిల్లాకు చెందిన ఇందర్‌సింగ్‌ అనే వ్యక్తికి సెషన్స్‌ కోర్టు ఓ హత్య కేసులో 2005 మార్చి 14న జీవిత ఖైదు విధించింది.

అయితే ఆ తీర్పును హైకోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌కి, చింద్వారా జిల్లా ‘ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి’కి ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇందర్‌సింగ్‌ 2009 సెప్టెంబర్‌ 25న విడుదల కావాల్సి ఉంది. కానీ 2012 జూన్‌ 25 దాక రిలీజ్‌ కాలేదు. అంటే.. 3 ఏళ్ల 11 నెలల 5 రోజులు అదనంగా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఈ వ్యవహారంలో తప్పుచేసినవారిపై తప్పకుండా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

Show comments