Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jail Term: సహజంగా ఖైదీలు శిక్షా కాలం ముగియటం కన్నా ముందే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ అప్లికేషన్ ఆమోదం పొందితే రిలీజ్ అవుతారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఓ ఖైదీ తన శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా దాదాపు నాలుగేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మామాలుగైతే శిక్షా కాలం ముగిసిన ఖైదీలను జైలు అధికారులు వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ ఇతని విషయంలో అలా జరగలేదు.
జైలు సూపరింటెండెంట్‌కి, సెషన్స్ జడ్జికి లాయర్ ప్రత్యేకంగా లెటర్ రాశాక గానీ అతణ్ని విడిచిపెట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎందుకిలా జరిగిందో ఎవరికీ అర్థంకావట్లేదు. పూర్వాపరాలను తెలుసుకునేందుకు హైకోర్టు జడ్జి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. మానవ హక్కుల పరంగా అతనికి జరిగిన నష్టానికి 3 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. బాధితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితుడు చేసిన డిమాండ్‌లో వంద శాతం న్యాయం ఉందని చెప్పారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి పేరు జస్టిస్ ఎస్‌ఏ ‘ధర్మాధికారి’ కావటం గమనించాల్సిన విషయం. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఆయన అన్నారు. ఖైదీ విడుదల ఉత్తర్వులను జారీ చేయాల్సిన బాధ్యత ‘ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిదే’ అని స్పష్టం చేశారు. ఈ మొత్తం తతంగంలో అసలు ఏం జరిగిందో దర్యాప్తు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ‘రిజిస్ట్రార్-విజిలెన్స్’ని ఆదేశించారు. ఈ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చింద్వారా జిల్లాకు చెందిన ఇందర్‌సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు ఓ హత్య కేసులో 2005 మార్చి 14న జీవిత ఖైదు విధించింది.
అయితే ఆ తీర్పును హైకోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌కి, చింద్వారా జిల్లా ‘ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి’కి ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇందర్‌సింగ్ 2009 సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. కానీ 2012 జూన్ 25 దాక రిలీజ్ కాలేదు. అంటే.. 3 ఏళ్ల 11 నెలల 5 రోజులు అదనంగా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఈ వ్యవహారంలో తప్పుచేసినవారిపై తప్పకుండా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!