Site icon NTV Telugu

Man Rescues Daughter: ‘టేకెన్’ మూవీ తరహాలో.. కిడ్నాప్ అయిన కూతురును రక్షించుకున్న రోజువారీ కూలీ

Man Rescues Daughter

Man Rescues Daughter

Man Rescues Daughter: కిడ్నాప్‌ అయిన తన కూతురును ‘టేకెన్‌’ సినిమా తరహాలో రక్షించుకున్నాడు ఓ తండ్రి. ఈ సంఘటన మహరాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. నిందితుడు షాహిద్ ఖాన్ (24) బాంద్రాలోని వస్త్రాల తయారీ యూనిట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సెప్టెంబరు 4న షాపింగ్ కోసం తనతో పాటు రావాలని నిందితుడు బాలికను కోరాడు. షాపింగ్‌ కోసం తనతో రావాలని ఆమెను పిలిచాడు. దీంతో పని ఉన్నదని ఇంట్లో చెప్పిన ఆ బాలిక, ఆ యువకుడి వెంట వెళ్లింది. అయితే ఆమెను కుర్లాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సూరత్‌కు బస్సు ఎక్కి రైలులో ఢిల్లీకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ అలీఘడ్‌ సమీపంలోని ఐత్రోలి గ్రామానికి ఆ బాలికను అతడు తీసుకెళ్లాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు బాలిక తన తల్లికి ఏదో సాకు చెప్పి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి, కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తన కుమార్తె ఆచూకీ కనిపెట్టేందుకు ‘టేకెన్’ మూవీ తరహాలో చాలా ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని ఆరా తీశాడు. అతను అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామానికి చెందినవాడని తెలుసుకున్న బాధితురాలి తండ్రి నిందితుడి కుటుంబాన్ని సంప్రదించి స్థానిక పోలీసులు, గ్రామస్తుల సహాయంతో ఆమెను రక్షించగలిగాడు.

Lumpy Disease: లంపి వ్యాధితో ఇప్పటివరకు 57వేల పశువులు మృతి.. వ్యాక్సినేషన్ పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

“సూరత్‌కు బస్సులో మత్తులో ఉన్న స్థితిలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని నా కుమార్తె చెప్పింది” అని బాలిక తండ్రి వాదిస్తూ, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 363 (కిడ్నాప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైందని, బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత మరిన్ని సెక్షన్లు జోడించబడతాయని నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

Exit mobile version