Site icon NTV Telugu

IIFL Manager Cheating:ఐఐఎఫ్ఎల్ బ్యాంక్ మేనేజర్ నిర్వాకం

అవసరానికి అక్కరకు వస్తుందని బంగారాన్ని తాకట్టుపెడితే ఆ బంగారాన్ని కాజేశాడో బ్యాంక్ మేనేజర్. ఐఐఎఫ్ ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడా మేనేజర్. క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పందెం కాశాడు మేనేజర్ రాజ్ కుమార్. తమ బ్యాంకులో తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేశాడు రాజ్ కుమార్.

వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు. కోట్ల రూపాయల బెట్టింగ్ కి పాల్పడ్డ రాజ్ కుమార్ తన దగ్గర అంత మొత్తం లేకపోవడంతో బంగారాన్ని మాయం చేశాడు. రాజ్ కుమార్ నిర్వాకంపై ఐ ఐ ఎఫ్ ఎల్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఆ బంగారాన్ని ఏం చేశాడనేది ఆరా తీస్తున్నారు. దీంతో తమ బంగారం కావాలని గోల్డ్ లోన్ ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

https://ntvtelugu.com/head-constable-got-heart-attack-medaram-jatara/
Exit mobile version