Hyderabad: సోషల్ మీడియాతో యువత జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుని కోసం ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. అంతే కాదు.. బంధువుల ఇంట్లో దొంగతనం చేసి మరీ వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు. కూతురు ప్రేమలో పడింది. అది తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆమెను తీరు మార్చుకోవాలని సూచించారు.. ప్రేమ విషయంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందున్న ఉద్దేశ్యంతో ఆమెను సొంత బంధువుల ఇంటికి పంపించారు. కానీ అక్కడి నుంచి 15 తులాల బంగారం, లక్షా 50 వేల నగదు తీసుకుని పరారైంది. ఈ ఘటన హైదరాబాద్ బోయిన్‌పల్లిలో జరిగింది..
READ ALSO: Arunachalam : అరుణాచలంలో అనుమానాస్పద మృతి.. నవీన్ ది హత్యా? ఆత్మహత్యా?
హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ యువతికి.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాహుల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో తండ్రి.. ఆమెను మందలించాడు. బోయిన్‌పల్లిలోని పెద నాన్న ఇంటికి పంపించారు. అక్కడ బాగానే ఉంటుందనుకున్న సమయంలో వారి ఇంట్లోనే చోరీ చేసింది యువతి. ఏకంగా 15 తులాల బంగారం, లక్షా 50 వేల రూపాయలు తీసుకుని పరారైంది…
కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె ఫోన్‌కు కాల్ చేశారు. కానీ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు.. సిటీలో పలు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆమె ఎటువైపు వెళ్లి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లొకేషన్ ద్వారా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు…
READ ALSO: Asia Cup 2025: ఆసియాకప్ చరిత్రలో ఇండియా – పాక్ జట్లు ఆసక్తికర ముచ్చట..
