Hyderabad : హెయిర్ క్లిప్ లలో అక్రమంగా తరలిస్తున్న రూ. 20 లక్షల బంగారం పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఇవాళ సీజ్ చేశారు.. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు..
గత ఏడాది లో కూడా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. గత ఏడాది ఆగస్టు 14న రూ. 13.63 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. లో దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు ప్రయాణీకుడిని అడ్డుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 6 వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువల రూ. 3.5 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అలాగే ఈ ఏడాది కూడా జూలై లో . 1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. క్యాప్యూల్స్ రూపంలో బంగారాన్ని తీసుకు వచ్చిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్రమార్కులు కొత్త మార్గంలో ఈ బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చీరకు బంగారాన్ని స్ప్రే చేసి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఏకంగా జడ క్లిప్ లు, గాజులలో తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు..
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!