భార్యా, భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు ఆత్మ హత్య చేసుకొనేవరకు వెళ్తున్నాయి.. అలాంటి ఘటనలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తను మద్యం మానెయ్యమని భార్య బ్రతిమలాడుతుంది.. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది.. దానికి భర్త ఏమైనా చేసుకో నేను మారనని తేల్చి చెప్పిన భర్త.. భార్య, భర్త కళ్ళముందే ఉరివేసుకుంటుంటే భర్త దాన్ని వీడియో తీసాడు.. భార్య చనిపోయింది.
వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన తెలంగాణ హైదరాబాద్ లో వెలుగుచూసింది.. మురాద్‌నగర్ సయ్యద్ అలీగూడలో నివసించే రసూల్, అర్షియా బేగం దంపతులకు ఐదేండ్ల క్రితం పెండ్లయ్యింది. అయితే రసూల్‌కు అదివరకే పెండ్లి కాగా.. ఆ విషయాన్ని దాచి అర్షియాను కూడా చేసుకున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు కూడా ఉండటంతో వీరిద్దరి మధ్య దాదాపు ప్రతిరోజు గొడవలు జరిగేవి.. మానసికంగా భర్త చేష్టలవల్ల విసిగిపోయిన ఆమె మద్యం మానేయకుంటే ఉరిపోసుకుంటానని చెప్పి మరీ చనిపోయింది..
సోమవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.. ఈ వేధింపులు తట్టుకోలేనని, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రసూల్.. ఆమెను మరింత రెచ్చగొడుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అన్నంత పని చేసిన అర్షియా తనవు చాలించింది. ఆమె తనను బెదిరిస్తున్నదని భావించి వీడియో తీశానని, ఇలా చనిపోతుందని అనుకోలేదని పోలీసుల ముందు వాపోయాడు.. పరోక్షంగానో, ప్రత్యేక్షంగానో అతను కారణం కావడం తో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు.. ఈ ఘటన స్థానికులను కలచి వేస్తుంది.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
