HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!
- బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు
- లగేజ్ బ్యాగ్‌లో హైడ్రోఫోనిక్ తెచ్చిన యువకులు
- అనుమానాస్పదంగా ఉండటంతో డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారుల దృష్టి
- 26 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD AIRPORT GANJAI: సినిమాటిక్ తరహాలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా… శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ ఏకంగా 9 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. బ్యాంకాక్ – హైదరాబాద్ డ్రగ్ రూట్ నెట్‌వర్క్‌పై కూపీ లాగుతున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సరిగ్గా ఇలాగే జరిగింది. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు… తమ లగేజ్ బ్యాగ్‌లో హైడ్రోఫోనిక్ గంజాయిని బ్లాక్ కవర్లలో ప్యాకింగ్ చేసి తీసుకొస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. పిల్లి కల్లు మూసుకుని పాలు తాగిన విధంగా తమను ఎవరూ చూడడం లేదని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ఉండటంతో డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు దృష్టి సారించారు. వాళ్ల బ్యాగులను తనిఖీ చేశారు.
పైకి నార్మల్‌గానే ఉన్న బ్యాగుల్లో మాత్రం ఇన్‌సైడ్ గంజాయి ఉన్నట్లు తేలింది. ఒక్కొక్క బ్యాగు విప్పి చూడగా.. అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో ఉన్న 26 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర ప్రదేశాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ఈ గంజాయి పండుతుందని చెబుతున్నారు అధికారులు. దాని విలువ కూడా మార్కెట్లో చాలా అధికంగా ఉంటుందంటున్నారు. దీంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ఇద్దరి ద్వారా బ్యాంకాక్ టు హైదరాబాద్ డ్రగ్ రూట్ నెట్‌వర్క్‌పై కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన గంజాయిని ఎవరికి అందజేయాలనుకున్నారు..? హైదరాబాద్‌లో ఉన్న పెడ్లర్లు ఎవరు..? వారి లిస్ట్‌లో ఉన్న కస్టమర్ల డేటాపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!