Hydroponic Ganja Hyderabad: డ్రగ్స్, గంజాయి.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఏ రూపంలో వచ్చినా.. తెలంగాణ పోలీసులు.. బ్రేక్ వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న గంజాయిని భారీ ఎత్తున పట్టుకున్నారు. ఇప్పుడు విదేశీ గంజాయిపైన దృష్టి పెట్టారు. విదేశాల్లో దొరికితే చాలా కాస్ట్‌లీ గంజాయిని స్మగ్లర్లు అధికారుల కళ్లుకప్పి విమానాల్లో దించేస్తున్నారు. ఐతే అలాంటి వాటికి ఎయిర్ పోర్టులోనే చెక్ పెడుతున్నారు అధికారులు. ఈ తరహాలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున విదేశీ గంజాయిని సీజ్ చేశారు.
READ ALSO: Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..
ఇది మామూలు గంజాయి కాదు.. హైడ్రోఫోనిక్ గంజాయి
షర్టుల మాటున గంజాయి ప్యాకెట్లు పెట్టి.. నీట్‌గా ప్యాక్ చేశారు. ఇలా తీసుకు వస్తే.. ఎవరికీ అనుమానం రాదనేది స్మగ్లర్ల ఆలోచన. ఇది మామూలు గంజాయి కాదు. హైడ్రోఫోనిక్ గంజాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ఈ గంజాయి.. చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. దీన్ని ఓ మహిళ బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకుని వచ్చింది. ఓ మహిళా బ్యాగేజీని చెక్ చేయగా.. అందులో 20 ప్యాకెట్లలో హైడ్రోఫోనిక్ గంజాయి కనిపించింది. మొత్తంగా 12 కిలోలు ఉన్నట్లుగా గుర్తించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో 12 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
బ్యాంకాక్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకు వచ్చిన మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్.. చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గతంలో నెల రోజుల క్రితం ఓ మహిళ ఇలాగే ఎయిర్ పోర్టులో గంజాయి తీసుకు వస్తూ పట్టుబడింది. కేవలం నెల రోజుల్లోనే మరో మహిళ ఇలాగే దొరకడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విదేశాల నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి వస్తుంది.. సరే.. కానీ ఇక్కడ రిసీవర్ ఎవరు అని గుర్తించే పనిలో పడ్డారు..
READ ALSO: Bathukamma: బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు తెలుసా!
