Site icon NTV Telugu

Hyderabad Scam: రూ.600 కోట్ల స్కామ్.. గేటెడ్ కమ్యూనిటీనే టార్గెట్ చేసిన కిలాడీ లేడీ!

Hyderabad Scam

Hyderabad Scam

Hyderabad Scam: ఒక మహిళ ఏకంగా కొన్ని వందల మందిని ముంచేసింది. గార్మెంట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరు చెప్పి మోసం చేసింది. అదే తరహాలో స్థలాల క్రయ విక్రయాలు అంటూ అక్రమాలు చేసింది. తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ చీటింగ్ చేసింది. ఖాళీ స్థలాలను చూపెట్టి ఏకంగా వందల కోట్లు కొట్టేసింది. ఒక్క గేటెడ్ కమ్యూనిటీలోనే ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి 300 కోట్లు కొట్టేసింది. అదే గేటెడ్ కమిటీ ద్వారా పరిచయాలు పెంచుకొని మరో 300 కోట్ల రూపాయలు కొట్టేసింది. మొత్తంగా 600 కోట్ల రూపాయలకు టోకరా వేసింది. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు?

READ ALSO: Gautam Adani: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. అదానీకి సెబీ క్లీన్‌చిట్..

పెట్టుబడుల పేరుతో మోసాలు..
ఆ కిలాడీ లేడీ పేరు.. సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఆమె టార్గెట్. గార్మెంట్‌ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలొస్తాయని ఎంతో మందిని బురిడీ కొట్టించింది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఆ కమ్యూనిటీ వాసులని మోసం చేసింది. ఏకంగా కమిటీ వాళ్ల దగ్గర నుంచి పెట్టుబడుల పేరుతో రూ.300 కోట్లు వసూలు చేసింది. గార్మెంట్ రంగంలో అధిక లాభాలు వస్తాయి అని నమ్మించి పెట్టుబడులను ఆకర్షించింది. కమ్యూనిటీలో ఉన్న వాళ్లతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి బయట వాళ్ల దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో పెట్టుబడులు తీసుకుంది. దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఈమె చేతిలో మోసపోయిన వైజాగ్‌కు చెందిన దొరైరాజు అనే వ్యక్తి.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం బయటపడింది. సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఆ సమయంలో కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమేనని తేలింది. ఆ తర్వాత బాధితులు సీసీఎస్‌కు క్యూ కట్టడంతో ఏకంగా 600 కోట్ల రూపాయలు అని బయటపడింది. సీసీఎస్‌లో పోలీసులు సంధ్యారాణిని అరెస్టు చేసి తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. అదే సమయంలో సైబరాబాద్‌లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా మరొ 300 కోట్ల రూపాయల మోసం బయటపడింది…

ఖరీదైన ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలను చూపెట్టి అక్కడ కమర్షియల్ బిల్డింగ్‌లు కడుతున్నామంటూ పెట్టుబడులు పెట్టించింది. ఈ మోసానికి మొత్తంగా గంగాధర్ అనే వ్యక్తి సంధ్యారాణికి పూర్తిస్థాయిలో సహాయం చేశాడు. గంగాధర్, సంధ్యారాణి ఇద్దరు కూడా పార్ట్‌నర్సే. అయితే గంగాధర్ ఎవరితోనైనా పెట్టుబడులు పెట్టించాలంటే ముందుగా తాను సంధ్యారాణి కంపెనీలో పెట్టుబడులు పెట్టానని డబ్బులు వచ్చాయని లాభాలు చూపెట్టేవాడు. సంధ్యారాణి బాధితుల లిస్ట్‌లో ప్రముఖులతో పాటు , మాజీ మున్సిపల్‌ ఛైర్మన్లు, ఎంతోమంది వస్త్ర వ్యాపారులున్నట్లు తేల్చారు పోలీసులు. ఒకే గేటెడ్‌ కమ్యూనిటీలో సంధ్యారాణి రూ. 180 కోట్లు కలెక్ట్‌ చేయడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. అంతేకాదు.. GST, TDS ఇన్‌వాయిస్‌లు మార్చి కస్టమర్లను బురిడీ కొట్టించినట్లు తెలిపారు. మోసం బయటకు రాగానే దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడించారు. ఇంటిపేరు మార్చి దుబాయ్‌ రెసిడెంట్‌ కార్డు కూడా పొందినట్లు పోలీసులు తేల్చారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం 5 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు తమ డబ్బులు కావాలంటూ చాలామంది హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు…

READ ALSO: September 21: ఆకాశంలో అద్భుతం.. ఎందుకు అంత ప్రత్యేకం అంటే..

Exit mobile version