Husband Throws Wife: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్ పైనుంచి భార్యను తోసి హత్య చేసిన సంఘటన ఆదివారం నాడు అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మందమర్రి ప్రాంతానికి చెందిన రజిత అనే మహిళను ఆమె భర్త కుమార్ స్వామి వంతెనపై నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం నాడు రాత్రి సుమారు 2 గంటల సమయంలో చోటు చేసుకుంది.
Read Also: Nari Nari Nadumu Murari: సంక్రాంతి బరిలో నారీ నారీ నడుమ మురారి
అయితే, స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రజిత మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం ఉండడంతో కోపాంలో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు నస్పూర్ పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.
