Site icon NTV Telugu

Panjagutta Crime: బాత్‌రూమ్ బ‌కెట్‌లో భార్య మృత‌దేహం.. రైలుకింద‌ప‌డి భ‌ర్త మృతి

Murder

Murder

కుటుంబకలహాలతో భార్య భర్త ఇద్దరు మృత్యువాత ప‌డుతున్నారు. హాస్యాస్ప‌దంగా సాగే మాట‌లు గొడ‌వ చేసుకుని ఒక‌రిపై మరొక‌రు చంపుకునేందుకు వెనుకాడ‌టంలేదు. మరి వీరి కుటుంబంలో ఏంజ‌రిగిందో ఏమో కానీ త‌న భార్య‌ను అతి దారుణంగా చంపి.. త‌నుకూడా మృత్యుఒడికి చేరుకున్నాడు. ఈ ఘ‌ట‌న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకుంది.

ఇక వివ‌రాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహా నందు బి. స్పాస్, భార్య పంపా సర్కార్ ఇరవై రోజుల క్రితం హైద‌రాబాద్ లోని ప్రేమ్ నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. భార్య భర్తలిద్ద‌రు ఓ ప్ర‌ముఖ మాల్ లోని ఒక షాపులో పనిచేస్తున్నారు. అయితే వీరిద్ద‌రు ఒక విష‌యంలో జ‌రిగిన చ‌ర్చ గొడ‌వ‌కు దారి తీసింది. అది మూడురోజులుగా జ‌రుగుతూనే వుండ‌టంతో విసుగు చెందిన భ‌ర్త నిన్న (ఆదివారం) భార్యను అతి కిరాత‌కంగా చంపాడు. బాత్‌రూంలోని బ‌కేట్ లో భార్య మృత‌దేహాన్ని వుంచి.. త‌రువాత త‌నుకూడా.. రైలు కొందప‌డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

Maharashtra Political Crisis: శివసేనకు బిగ్‌ షాక్.. ఏ క్షణమైనా ఎంపీలు జంప్..!

Exit mobile version