Site icon NTV Telugu

Dowry Harassment: రూ.10 లక్షలు వరకట్నం, కారు కోసం భర్త అమానుషం.. భార్యను కొడుతూ.. వైరల్ వీడియో

Dowry Harassment

Dowry Harassment

Dowry Harassment: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ గృహహింస సంఘటన చోటు చేసుకుంది. రూ.10 లక్షలు నగదు, కారు ఇవ్వాలన్న భర్త డిమాండ్‌ను భార్య తిరస్కరించడంతో, ఆమెపై ఘోరంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త భార్యపై దాడి చేసుతున్న సమయంలో ఇంటి చుట్టుపక్కన్న వాళ్లు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

BJP: రాహుల్‌గాంధీ విందులో ఉద్ధవ్ థాక్రేకు అవమానం.. వెనుక సీటులో కూర్చోబెట్టారని బీజేపీ విమర్శ

ఈ దాడిలో భార్యకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఉధంపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ (GMC)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, భర్త భార్యను అమానుషంగా కొడుతూ ఉండడం గమనించవచ్చు. ఘటనలో భర్త తన భార్య చేతి పట్టుకుని ఇంటి గేటు వైపు బలవంతంగా ఈడుస్తూ కనిపించాడు. దాడి జరుగుతున్నంతసేపు ఆమె బాధతో అరుస్తుండగా భర్త మాత్రం కొడుతూ, తిడుతుండడం చేశాడు. ఈ ఘటనతో భార్య కుటుంబ సభ్యులు రేహంబల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు అజామ్ అలీ తరచుగా కట్నం కోసం వేధింపులు, గృహహింసకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.

ICICI Bank Minimum Balance: ఖాదారులకు షాక్.. ఇకపై 50,000 ఉండాల్సిందే..!

దీనితో పోలీసులు తక్షణమే స్పందించి IPC 498A (కట్న వేధింపులు) భర్త లేదా బంధువుల ద్వారా హింసకు సంబంధించిన చట్టపరమైన విభాగాలతో పాటు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి నీచపు వారిని చంపేసిన పర్వాలేదంటూ పెద్దెతున్న ప్రజలు తమ ఆగ్రహాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.

Exit mobile version