Site icon NTV Telugu

Indore Murder: గర్ల్‌ఫ్రెండ్‌‌ను రేప్, హత్య చేసి ఇంత కూల్‌గా ఉన్నావేంట్రా.. భయం పుట్టిస్తున్న ఇండోర్ మర్డర్ కేసు..

Indore Murder

Indore Murder

Indore Murder: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని హత్య, అత్యాచారం కేసు సంచలనంగా మారింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పీయుష్ ధమనోతియా దారుణకాండ వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంత క్రూరమైన హత్యకు పాల్పడినప్పటికీ మీడియా ముందు ఎంతో ప్రశాంతంగా, చిరు నవ్వుతో కనిపించడం అతడి క్రూరత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. నేరం చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదు. ‘‘ ఏం జరగాలో అంతా అయిపోయింది. వదిలేయండి, తెలుసుని మీరు ఏం చేస్తారు? సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా’’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించాడు.

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, పీయూష్ తన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి, మళ్లీ శవంపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీని తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయి, తన గర్ల్‌ఫ్రెండ్ ఆత్మను తిరిగి పిలిచేందుకు క్షుద్ర విద్యలు చేశాడు. కుటుంబం ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

వాట్సాప్‌లో యువతి అశ్లీల వీడియోలు..

ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి, మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బర్త్ సర్టిఫికేట్ కోసం కలెక్టరేట్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె తండ్రి దింపాడు. తర్వాత బాధితులురాలు తన చెల్లికి ఫోన్ చేసి క్లాస్‌మేట్, బాయ్‌ఫ్రెండ్ అయిన పీయుష్‌తో బర్త్ డే పార్టీకి వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వస్తానని చెప్పింది. అయితే మళ్లీ ఇంటికి వెళ్లలేదు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విఛ్ ఆఫ్ అయింది. దీని తర్వాత, ఆమె అశ్లీల వీడియోలు కాలేజ్ వాట్సాప్ గ్రూప్‌కు షేర్ అయ్యాయి. ఆమె ముఖం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆమెతో ఉన్న వ్యక్తి ముఖాన్ని ఏమోజీతో కవర్ చేశారు. ఇది పీయుష్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే వీడియోలను ఆమె స్టేటస్‌గా పెట్టాడు.

క్రూరంగా హత్య..

దీనిపై సమాచారం అందుకున్న కాలేజ్ యాజమాన్యం కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీని తర్వాత బుధవారం రాత్రి మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. రెండు రోజుల తర్వాత శుక్రవారం పీయుష్ గది నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు తెలియజేశారు. తాళం పగలగొట్టి చూడగా అందులో యువతి నగ్న స్థితిలో కనిపించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో పీయుష్ యువతితో గదిలోకి వెళ్లి, 2.5 గంటల తర్వాత బ్యాగ్‌తో బయటకు వెళ్లినట్లు రికార్డైంది.

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, పీయూష్ సెక్స్ కోసం యువతిపై ఒత్తిడి తెచ్చాడని, అనారోగ్యం కారణంగా అందుకు ఒప్పుకోలేదని, కానీ బలవంతంగా రేప్ చేశాడని చెప్పారు. ఆమె కాళ్లు చేతులు కట్టేసి, గిఫ్ట్ ఇస్తానని చెప్పి, నోట్లో గుడ్డలు కుక్కి, ఛాతిపై కూర్చుని ఊపిరి ఆడకుండా హత్య చేశాడు. కత్తితో ఛాతిలో పొడిచాడు. గదిలోనే మృతదేహం పక్కన కూర్చుని బీర్ తాగాడు. శవంపై మళ్లీ లైంగిక దాడి చేశాడు. బట్టలు మార్చుకుని ముంబై, పన్వేల్ పారిపోయాడు. ముంబై పోలీసులు సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో తాను ఆమెను ప్రేమించానని, 15 రోజులుగా దూరంగా ఉంటుందని, ఆమె ఫోన్‌లో డేటింగ్ యాప్ చూడటంతో గొడవ అయినట్లు పీయుష్ చెప్పారు.

Exit mobile version