NTV Telugu Site icon

Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్‌

Nadini Ded

Nadini Ded

Dowry: భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ గృహిని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం రోజు వేధించిన భరించింది. కన్నబిడ్డను కోసం బాధలన్నీ భరిస్తూ వచ్చింది. చివరకు సహనం కోల్పోయిన ఆమె బలావన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో చోటుచేసుకుంది.

Read also: MS Dhoni : ప్లీజ్ ధోని.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవొద్దు.. మహీకి పైలెట్ రిక్వెస్ట్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో రత్నదీప్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక లోని బీదర్ జిల్లాకు చెందిన నందినీతో తనకు వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వారికి ఒక చిన్న బాబుకూడా వున్నాడు. అనోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. అయినా భరిస్తూ తన చిన్నారి కొడుకోసం బతుకుతూ వచ్చింది. కానీ డబ్బులకోసం వేధింపులు తీవ్రంగా మారాయి. డబ్బులు తీసుకురావాలని కర్కసంగా వేధించారు భర్త, అత్తమామలు అది భరించలేక పోయింది నందిని. చివరకు చావే సరన్యమని భావించింది నందిని. తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ నందిని బయటకు రావకపోవడంతో భర్త గది వైపు వెళ్లి చూడగా నందిని ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది. దీంతో భర్త తన తల్లిదండ్రులకు చెప్పగా.. కనీకరంలేని రత్నదీప్ తల్లిదండ్రులతో నీ అత్తమామలకు చెప్పి నందిని శవాన్ని తీసుకుని వెళ్లమని చెప్పమన్నారు.

Read also: Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..

తల్లిదండ్రులను చెప్పినట్టే రత్నదీప్‌ నందిని పేరెంట్స్‌ కు కాల్‌ చేసి మీ బిడ్డ నందిని చనిపోయింది వచ్చి సవాన్ని తీసుకుని వెళ్లండి అని చెప్పాడు. దీంతో నిర్ఘాంతపోయిన నందిని తల్లిదండ్రులు హుటాహుటిని హైదరాబాద్ కు వచ్చారు. నందిని విగత జీవితగా పడిఉండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ నందినీ పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఒంటి పై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారని కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని నందిని ఫోన్‌ చేసి తన బాధను చెప్పుకుందని వాపోయారు. సరే మేము వచ్చి మాట్లాడుతామని నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్పామని ఇంతలోనే నీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ అల్లడు ఫోన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నందిని తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త రత్నదీప్ అరెస్ట్ చేయగా.. అత్తమామ విజయ, లక్ష్మన్ రావు పరారీలో వున్నారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ నందిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్

Show comments