Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Honour Killing In Kakinada Youth Murdered By Girlfriends Brother For Being In Love

Kakinada: కాకినాడలో పరువు హత్య కలకలం..

Published Date :July 5, 2025 , 9:09 pm
By RAMAKRISHNA KENCHE
  • ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న తండ్రి వెంకటరమణ
  • తండ్రికి సహాయంగా పని చేస్తున్న కిరణ్ కార్తీక్
  • డబ్బులు విషయంలో తేడా రావడంతో కొడుక్కి మందలింపు
  • ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోయిన కిరణ్ కార్తీక్
  • 3 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు
  • మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు
Kakinada: కాకినాడలో పరువు హత్య కలకలం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అఘాయిత్యాలు చేసేవారు. కాకినాడ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో టచ్‌లో ఉన్న యువకున్ని..యువతి సోదరుడు హతమార్చాడు. వేమవరంలో ఈ హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు కిరణ్ కార్తీక్. కాకినాడ జిల్లా వేమవరం స్వస్థలం. అతని తండ్రి వెంకటరమణ ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తండ్రికి సహాయంగా కిరణ్ కార్తీక్ కూడా అక్కడే పని చేస్తున్నాడు. అయితే షాపులో డబ్బులు విషయంలో తేడా రావడంతో గత నెల 24న వెంకట రమణ.. కొడుకు కిరణ్‌ను మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కార్తీక్ ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ..

READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..

కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో 3 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఐతే చివరికి అతని ఫోన్‌లో కాల్ లిస్ట్ ఆధారంగా మిస్టరీ ఛేదించారు. వేమవరంకు చెందిన ఓ యువతితో కిరణ్ కార్తీక్‌కు పరిచయం ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఐతే యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయం నచ్చలేదు. అతన్ని దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువతి తల్లిదండ్రులు, అన్నయ్య కృష్ణ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉంటుండగా.. ఆమె కాకినాడలోని ఓ హాస్టల్లో ఉండి నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా ఇద్దరూ మనను మార్చుకోవడం లేదని యువతి అన్నయ్య కృష్ణ ప్రసాద్.. కిరణ్ కార్తీక్‌ను చంపేయాలని ప్లాన్ వేశాడు..

READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..

అచ్చంపేట దగ్గరలోని బ్రహ్మానందపురం కాలనీ దగ్గరికి రావాలని కిరణ్ కార్తీక్‌కి చెప్పాడు కృష్ణ ప్రసాద్. తన చెల్లితో పెళ్లి విషయం మాట్లాడతానని అన్నాడు. దాంతో కిరణ్ కార్తీక్ అక్కడకి వెళ్లాడు. అతనికి ఫుల్‌గా మద్యం తాగించారు. ఈ సిట్టింగ్‌కి కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు వినోద్‌ని కూడా తీసుకుని వెళ్లాడు. మందు తాగిన తర్వాత తన చెల్లిని వదిలేయాలని దూరంగా ఉండాలని ఆమెను కష్టపడి చదివిస్తున్నామని అన్నాడు కృష్ణ ప్రసాద్. ఈ విషయాలు చెప్పడానికి అంటే అసలు తాను వచ్చేవాడిని కాదని ఎదురు తిరిగాడు కిరణ్ కార్తీక్. దాంతో ముందే ప్లాన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్, వినోద్.. కిరణ్ కార్తీక్ తలను నేలకేసి కొట్టి చంపేశారు. అదంతా ఓపెన్ సైట్ కావడంతో అక్కడే పూడ్చిపెట్టారు. తిరిగి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు..

READ MORE: 100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్‌ లాంచ్

కిరణ్ కార్తీక్ మృతితో అంతా అయిపోయిందని భావించారు. ఆ తర్వాత రెండు రోజులకు కృష్ణ ప్రసాద్ యధావిధిగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ సరిగ్గా ఇక్కడే కథ షురూ అయింది. కిరణ్ కార్తీక్ అదృశ్యానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఊర్లో పోలీసుల ఎంక్వయిరీలు.. కిరణ్ కార్తీక్ మొబైల్ కాల్ డేటా చెక్ చేయడం తెలియడంతో వినోద్ హడలిపోయాడు. వెంటనే విషయాన్ని కృష్ణ ప్రసాద్‌కి చెప్పాడు. ఊళ్లో పరిస్థితి బాలేదని జరిగిన ఘటన గురించి పోలీసులు విచారణ వేగవంతం చేశారని అన్నాడు. దాంతో తిరిగి వచ్చిన కృష్ణ ప్రసాద్ హత్య తామిద్దరం చేసామని పోలీసులుకి చెప్పి.. మృతదేహాన్ని పూడ్చిన దగ్గరికి తీసుకుని వెళ్లారు.

READ MORE: Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?

కిరణ్ కార్తీక్.. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ హత్యలో నిందితులు ఇంకా ఉండి ఉంటారని కిరణ్ కార్తీక్ పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. మొత్తానికి చెల్లిని ప్రేమిస్తున్నాడని అతికిరాతకంగా యువకుడిని కడతేర్చాడు కృష్ణ ప్రసాద్. ఆమె కెరీర్ పోతుందని ప్రేమించిన వాడిని చంపి పూడ్చి పెట్టాడు. తమ కొడుకు అన్యాయంగా బలయ్యాడని కిరణ్ కార్తీక్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh police investigation
  • ap crime news
  • Brahmanandapuram colony crime
  • Caste-based Violence
  • family opposition love story

తాజావార్తలు

  • First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions